సమంత ఫై చైతు ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు


సమంత ఈ పేరు వింటేనే నాగ చైతన్య అభిమానులు ఆగ్రహం ఊగిపోతున్నారు. ఒక్కప్పుడు తమ దేవతగా కొలిచిన వారే ఇప్పుడు దెయ్యంగా చూస్తున్నారు. తాజాగా కరణ్ షో లో సమంత చేసిన కామెంట్స్ ఫై అక్కినేని ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ‘నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత..’ అంటూ కరణ్ అంటుండగా.. మధ్యలో “మాజీ భర్త” అని సమంత అని ఒకింత సీరియస్ గానే మాట్లాడింది. అలానే మీ మధ్య ఇంకా ఏవైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని కరణ్ ప్రశ్నించగా.. ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అని సమంత చెప్పింది. అంతే కాదు తనకు పెద్ద ఎత్తున ఆభరణం ఇచ్చారనే వార్తలను ఖండించింది. ఓవరాల్ గా నాగ చైతన్య పేరు వినడానికి కానీ, చెప్పడానికి కానీ సామ్ ఇష్టపడడం లేదని ఈ ఇంటర్వ్యూ తో బయటపడింది.

అయితే చైతు మాత్రం ఇప్పటికి సమంత పేరు చెపుతూ వస్తున్నాడు. తాజాగా ‘థాంక్యూ’ ప్రమోషన్స్ లో భాగంగా చైతూ ఓ తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘స్క్రీన్ పై మీతో బెస్ట్ కెమిస్ట్రీని పంచుకున్న హీరోయిన్ ఎవరు?’ అని యాంకర్ ప్రశ్నించగా సమంత మరియు సాయి పల్లవి అని తెలిపాడు.

‘లవ్ స్టోరీ’ సినిమాలో సాయి పల్లవితో మంచి కెమిస్ట్రీని పంచుకున్నాను. సమంత నేను కలిసి స్క్రీన్ పై మంచి ప్రేమకథలు కూడా చేశాం. నన్ను అడిగితే నేను సాయి పల్లవి మరియు సామ్ అని చెబుతాను అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. చైతూ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తన మాజీ భార్య పేరు పక్కన పెట్టకుండా ఆమె గురించి స్పందించిన తీరు.. అక్కడ కరణ్ జోహార్ షోలో చై గురించి సామ్ స్పందించిన విధానం పూర్తి భిన్నంగా ఉన్నాయి. చైతు పాజిటివ్ గా మాట్లాడితే..సామ్ మాత్రం ఆగ్రహంగా మాట్లాడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.