Site icon TeluguMirchi.com

వేలానికి అక్కినేని కుటుంబ ఆస్తులు

akkineni heroటాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. చాలా సంవత్సరాలుగా అక్కినేని వారు పలు వ్యాపారాలు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక ధనవంతులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం నాగార్జున బ్యాంకు లోను కట్టక పోవడంతో నోటీసులు అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున బ్యాంకుతో చర్చలు జరిపి ఆస్తులు వేలం వేయకుండా అడ్డుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున సోదర నాగ సుశీలకు బ్యాంకు నోటీసులు అందాయి.

ప్రముఖ ఎస్‌బిహెచ్‌ బ్యాంకు నుండి అక్కినేని వారి ఇంటి ఆడపడుచు రెండు కోట్ల రూపాయలు రుణం పొందింది. ఆ రుణం తిరిగి చెల్లించడంలో ఆమె జాప్యం చేస్తుంది. పలు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత నాగ సుశీల ఆస్తులను వేలం వేయబోతున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. జూబ్లి హిల్స్‌లోని ఖాళీ స్థలం మరియు ఒక భవనాన్ని నాగ సుశీల తనక పెట్టింది.

వాటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అక్కినేని వారి కుటుంబ సభ్యులు ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేక వారు బ్యాంకుకు ఎగనామం పెట్టాలని ఇలా ఆర్థిక ఇబ్బందుల నాటకం ఆడుతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రెండు కోట్ల అప్పులు కట్టలేని స్థితిలో అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారని ఏ ఒక్కరు అనుకోరు..!

Exit mobile version