అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్’ ఘోర పరాజయం పాలైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి చిత్రం బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడడంతో అక్కినేని అభిమానులతో పాటు అఖిల్ కుటుంబం కూడా చాలా ఫీలయ్యారు. అందుకే ఈ సారి చాలా విరామం తీసుకుని తగు శిక్షణ తీసుకున్నాక, కథ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని చివరకు విక్రమ్ కుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ విషయంలో నాగ్ చాలా మార్పులు చేర్పులు చేశాడట. అదంతా కూడా అఖిల్ ఎలాగైనా హిట్ అవాలనే ఉద్దేశ్యంతోనే. అందుకే సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త ఆలస్యం అయ్యింది. ఈ నెల తొలి వారం నుండే అఖిల్ రెండో చిత్ర షూటింగ్ రెగ్యులర్‌గా జరుపుకుంటోంది.
అఖిల్ రెండో చిత్రంతో ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని గట్టిగా పట్టుబట్టాడు. అందుకు తన పెళ్లిని కూడా రద్దు చేసుకుని ప్రేయసిని వదిలేశాడు. తాజాగా పెరిగిన ఎండలను సైతం అఖిల్ లెక్కచేయడం లేదట. ఎండ తీవ్రత ఎలా ఉన్నా కూడా అఖిల్ తన ఫోకస్ మొత్తం సినిమాపైనే పెట్టాడట. రెండో చిత్రం పట్ల అఖిల్‌కు ఉన్న శ్రద్దను చూసి యూనిట్ సభ్యులు కూడా షాకవుతున్నారు. హీరో ఎండను లెక్కచేయకుండా పని చేస్తుంటే మిగతా టీం అంతా కూడా చాలా శ్రద్దగా తమ పనులు కానిచ్చేస్తున్నారట. రెండో సినిమాపై పూర్తి శ్రద్దను కనబర్చి షూటింగ్లో పాల్గొంటున్న అఖిల్‌కు ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరి.