అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని మొదటి చిత్రం ‘అఖిల్’తో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నాడు. భారీగా రూపొందించిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బొక్కా బోర్లా పడడంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దాంతో అఖిల్ తదుపరి చిత్రాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఒకే చేశాడు. ఆచితూచి అడుగులు వేస్తూ రెండో చిత్రంతో ప్రేక్షకులను తృప్తి పరచాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఫ్లాపు అయితే ప్రేక్షకులను అఖిల్ మెప్పించడం కష్టమే అందుకే మొదటిది పోయినా కూడా రెండో చిత్రంతో సక్సెస్ అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ చిత్రాన్ని ‘మనం’ ఫైం విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడు.
40కోట్ల బడ్జెట్‌తో కేవలం ఫైట్ల కోసమే ఏకంగా 20 కోట్లను కేటాయించి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్‌ను అంతా ‘జున్ను’ అని పిలుస్తారట. అందుకే టైటిల్‌గా ‘జున్ను’ను ఖరారు చేస్తే ఎలా ఉంటుంది అని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నారు.
అఖిల్ ‘జున్ను’ చేస్తున్నాడు అనేది చాలా వెరైటీగా ఉంది. వినూత్నంగా టైటిల్ ఉంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే నాగ్ ఒకే చెబితే వెంటనే రిజిస్టర్ కూడా చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయలేదట.