పెళ్లి క్యాన్సిల్‌.. మెగా, అక్కినేని ఫ్యామిలీల వైరం

akhil sriya

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌, జీవీకే మనవరాలు శ్రియ భూపాల్‌ల నిశ్చితార్థం అయిన తర్వాత, త్వరలో పెళ్లి అనుకుంటున్న సమయంలో క్యాన్సిల్‌ అయిన విషయం తెల్సిందే. వీరి పెళ్లి క్యాన్సిల్‌ కారణంగా అక్కినేని మరియు మెగా ఫ్యామిలీల మద్య కాస్త దూరం పెరిగినట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జీవీకే ఫ్యామిలీకి మెగాస్టార్‌ కోడలు ఉపాసన చాలా సన్నిహితురాలు. శ్రియ భూపాల్‌ తల్లి మరియు ఉపాసన వ్యాపారంలో భాగస్తురాల్లు. పలు కార్యక్రమాల్లో వీరిద్దరు అన్యోన్యంగా, ఆప్యాయంగా కలిసి ఉండటం కనిపించింది.

పెళ్లి క్యాన్సిల్‌ తర్వాత అక్కినేని మరియు జీవీకే ఫ్యామిలీల మద్య దూరం పెరిగింది. దాంతో మెగా ఫ్యామిలీ కూడా అక్కినేని ఫ్యామిలీకి దూరం అయినట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీతో ఉపాసన పూర్తి సంబంధాలను తెంచుకున్నట్లుగా సమాచారం. ఉపాసన దారిలోనే రామ్‌ చరణ్‌ కూడా అక్కినేని ఫ్యామిలీకి కాస్త దూరం మెయింటెన్‌ చేస్తున్నాడు. అయితే చిరంజీవి మరియు నాగార్జునల మద్య సంబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. అఖిల్‌ పెళ్లి మెగా మరియు అక్కినేని ఫ్యామిలీలను కూడా దూరం చేసింది.