‘మనం’లో అఖిల్ కూడా ఉన్నాడా? తాతయ్య, నాన్నతో కలసి నటించే చివరి అవకాశాన్ని అఖిల్ పొందాడా?? గత కొంతకాలంగా ఈ విషయమై అక్కినేని అభిమానులు ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం మా సినిమాలో అఖిల్ లేడని తేల్చింది. నాగ్ కూడా ఇదే విషయం చాలాసార్లు మీడియాకి చెప్పారు. అయితే ఓ ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే.. మనంలో అఖిల్ ఉన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమిది. ఇప్పుడు కాకపోతే… ఆయనతో కలసి నటించే అవకాశం ఎప్పుడూ దొరక్కపోదును. అందుకే.. ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ ఇచ్చేశాడు. అఖిల్కంటూ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రేం లేదు. కేవలం కొన్ని షాట్స్ లలో కనిపిస్తాడంతే. సెంటిమెంట్ గా బాగుంటుందని అఖిల్ ని ఈ సినిమాలో చేర్చేశారు నాగ్. ఇటీవల అఖిల్ ఎంట్రీకి సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించారట. టైటిల్ రోలింగ్లో అఖిల్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి మనం ఇన్నాళ్లకు పరిపూర్ణమైందన్నమాట.