బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయకిగా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి రెండు పాటలు సంచలన విజయం సాధించగా, ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు, మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థండర్ ఆగస్ట్ 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ పోస్టర్‌లో రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ కి ‘అఖండ’ అదేనండి నందమూరి బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా కన్ఫర్మ్ అయినట్లు చిత్రబృందం తెలిపింది. ఇకపోతే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.
It’s 𝐌𝐀𝐒𝐒ive Celebrations Time
Shri #NandamuriBalakrishna garu will grace the #SkandaPreReleaseThunder
on AUG 26th
#AkhandaForSkanda
#SkandaOnSep15
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake… pic.twitter.com/yYlKri4jZH
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 24, 2023