Good Bad Ugly : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుండి అజిత్ కుమార్ స్టన్నింగ్ లుక్ రిలీజ్


స్టార్ హీరో అజిత్ కుమార్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Kalki 2898 AD Review | కల్కి2898 AD రివ్యూ

తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫామ్ లో ఎలక్ట్రిఫైయింగ్ న్యూ అవతార్ లో కనిపించిన ఈ పవర్ ప్యాక్డ్ లుక్ అదిరిపోయింది. అజిత్ చేతిపై వున్న టాటూ, బ్యాక్ గ్రౌండ్ లో మ్యాసీవ్ గన్ ఫైరింగ్ స్టన్నింగ్ గా వున్నాయి. అందరినీ ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.