జ్వరం వచ్చి హాస్పిటల్‌కు వెళ్తే లక్ష బిల్లు వేశారట

 

Aishwarya Rajesh

తమిళనాట ప్రస్తుతం అత్యధికంగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్య రాజేష్‌. ఈ అమ్మడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలకు పైగా ప్రస్తుతం చేస్తోంది. ఒకే సారి ఇన్ని సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా ఈ అమ్మడు రికార్డు సాధించింది. తెలుగులో ఈమె నటించిన కౌశల్య కృష్ణమూర్తి చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే సమయంలో తమిళంలో ఈమె నటించిన మేయ్‌ అనే చిత్రం కూడా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం వైధ్య వృత్తి పేరుతో జరుగుతున్న మోసాలు, వ్యాపారం గురించి ఉంటుందట.

తాజాగా మేయ్‌ చిత్రం గురించిన ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్‌మీట్‌లో ఈ అమ్మడు షాకింగ్‌ విషయం వెళ్లడించింది. తాను ఇటీవల జ్వరం కారణంగా హాస్పిటల్‌కు వెళ్లాను. కాస్త సీరియస్‌గా ఉంది అంటూ నన్ను వారు అడ్మిట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత రోజు ఆదివారం అవ్వడంతో డిచ్చార్జ్‌ చేయలేం అంటూ చెప్పారు. ఆ తర్వాత రోజు నా చేతిలో లక్ష బిల్లు పెట్టి, జ్వరంకు చాలా కామన్‌గా వాడే డోలో ట్యాబ్లెట్‌ పెట్టి ఇంటికి పంపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక సెలబ్రెటీని అయినా నాకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో అంటూ ఆమె సినిమా గురించి చెప్పుకొచ్చింది.