Site icon TeluguMirchi.com

రజనికి చెడ్డ పేరు తీసుకవస్తున్న ‘ఎయిరేషియా’..?

Travel-More-Kabali-Offerతమిళ సూపర్ స్టార్ రజని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కరలేదు..రజని పోస్టర్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఉగిపోతారు..అలాంటి రజనీకాంత్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది ”ట్రావెల్ మోర్ కంపెనీ & ఎయిరేషియా” అది ఎలాగో మీరే చూడండి..

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..ఈ సందర్భంగా “ట్రావెల్ మోర్ కంపెనీ & ఎయిరేషియా” సంయుక్తంగా ఓ ప్యాకేజ్ రూపం లో బెంగుళూర్ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించింది.. బెంగళూరు నుంచి బయల్దేరదీసి.. కబల్లి చిత్రాన్ని చూపించి లంచ్-స్నాక్స్ ఇప్పించి.. ఓ ఆడియో సీడీ చేతిలో పెట్టి మళ్లీ బెంగళూరులో డ్రాప్ చేస్తారట. ఈ మొత్తానికి కలిపి ప్యాకేజ్ గా టికెట్లు అమ్మడం స్టార్ట్ చేసారు..ఇది ఫ్రీ అనేది కాదు ప్యాకేజ్ మొత్తానికి కలిపి మనీ వాసులు చేస్తున్నారు.

కాగా ఈ ఆఫర్ ఫై రజిని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..రజని సినిమా ను ఓ చిన్న సినిమాల్ల చూస్తున్నారని , అందుకే ఇలా ఆఫర్ పెట్టి సినిమాని ప్రమోషన్ చేస్తున్నారని , అతడి పేరు ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోతున్నారు.

Exit mobile version