అమోజాన్, నెట్ ఫ్లిక్ష్ మనవి కావు. తెలుగు ప్రేక్షకులు తమవిగా వాటిని వోన్ చేసుకోలేదు. ఇలాంటి నేపధ్యంలో టాలీవుడ్ నుండి ఒక డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వచ్చింది. అదే ఆహా. టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో ఆహా ప్రేక్షకులని పలకరించింది. ఆహా వచ్చి ఏడాది కూడా అయిపొయింది. మొదట్లో కేవలం డబ్బింగ్ సినిమాలతో ఆహాలో కంటెంట్ నింపారు. మలయాళీ అనువాదాలు చాలా వున్నాయి.
అయితే ఇప్పుడిప్పుడే.. `క్రాక్` లాంటి పెద్ద సినిమాల్ని కొనగలుగుతోంది ఆహా. `కలర్ ఫొటో`లాంటి మంచి సినిమాలు ఆహాకి ప్లస్ అయ్యాయి. దాంతో ఆహా కూడా వినోదాల ఫ్లాట్ ఫామ్ గా సినీ గోయర్స్ గుర్తిస్తున్నారు. తాజాగా 25 మిలియన్స వ్యూవర్స్ ని సంపాదించుకోగలిగింది. అందుకే… ఆహా నెంబర్ 1గా మారిందని…. సగర్వంగా ప్రకటించుకుంటోంది. `మీరే ఆహా.. మీదే ఆహా` అంటూ.. ఓ కొత్త క్యాప్షన్ జోడించి ప్రేక్షకులకు మరింత దగ్గరవుదామనుఉంటోంది ఆహా. ఆహా వెనుక చాలా పెద్ద వాళ్ళు వున్నారు. అల్లు అర్జున్ లాంటి బ్రాండ్ వుంది. వాళ్ళు తలచుకుంటే అమోజాన్, నెట్ ఫ్లిక్స్ కి ధీటుగా ఆహా ఎదుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.