అంచనాలు పెంచుతున్న ‘ఏజెంట్’ ట్రైలర్


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఏజెంట్‌ ట్రైలర్‌ ను లాంఛ్ చేశారు.

నువ్వు ఏజెంట్ ఎందుకు కావాలనుకుంటున్నావ్‌.. అని అఖిల్‌ను మమ్ముట్టి అడుగుతున్న సంభాషణలతో మొదలైన ట్రైలర్‌ ఆధ్యంతం థ్రిల్లింగ్, యాక్షన్, విజువల్ అంశాలతో అదిరిపోయింది. ఇక అఖిల్ బాడీ, యాక్షన్ సీన్స్‌తో పాటు వైల్డ్ లుక్ అదిరింది. దీంతో ఒక్కసారిగా సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అమాంతం అంచనాలు పెరిగాయి.

ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తున్న ఈ మూవీలో డినో మోరియో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.