‘ఏజెంట్ శివ’’ గా మహేష్ బాబు ఫస్ట్ లుక్…

agent-shiva-1t-lookమహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో దాదాపు 70-80 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళం భాషలలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే..ఈ చిత్రానికి ఇదే టైటిల్ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారం జరుగుతూ వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘ఏజెంట్ శివ’’ అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చి హల్‌చల్ చేస్తూనే ఉంది..ఇక ఇదే టైటిల్ తో కూడిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది..

కాగా ఈ ఫస్ట్ లుక్ అధికారిక పోస్టరా లేక కావాలని ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టరా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్టర్ తెగ షేర్ అవుతుంది.. ఈ చిత్రం లో మహేష్ బాబు ఐబీ అధికారిగా కనిపిస్తుండడం , అలాగే శివ అనే రోల్ పోషిస్తుండడం తో ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’’ అని పెట్టారని తెలుస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా మహేశ్ ఓ పది సెకన్ల టీజర్‌ను విడుదల చేయబోతున్నారట. ఇటీవలే 20 రోజుల భారీ షెడ్యూల్ చెన్నైలో మొదలు పెట్టారు.

ఇక ఈ చిత్రం లో మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా , హరీష్ జేయరాజ్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.