‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్


టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థల పై అనిల్ సుంకర భారీ వ్యయంతో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ మరింతగా ఆకట్టుకుని అంచనాలు విపరీతంగా పెంచేశాయి.

తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘మళ్ళీ మళ్ళీ నువ్వే’ అనే బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ విడుదలయ్యింది. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించడం తో పాటు స్వయంగా పాడిన ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్‌ ట్విట్టర్‌ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. అఖిల్‌ ఈ పాటలో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. లవ్లీ ఎక్స్‌ ప్రెషన్స్‌ , ఎట్రాక్టివ్‌ డ్యాన్స్‌ మూవ్స్‌ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ పాటలోని విజువల్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ఈ మూవీ లో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య నటించింది.