టీజర్ టాక్ : ఐశ్వర్య ఘాటు రొమాన్స్ అదుర్స్..

Ae-Dil-Hai-Mushkil-Teaserబాలీవుడ్ లో ప్రేమకథలు తెరకెక్కించడం లో కరణ్ జోహార్ తర్వాతే ఎవరైనా అని అతని సినిమాలే చెపుతాయి. కుచ్ కుచ్ హోతా హై తో దర్శకుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఇతను, నిర్మాతగా కూడా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలు తీస్తూ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి కరణ్ నుండి తాజాగా “ఏ దిల్ హే ముష్కిల్” అనే చిత్రం రాబోతుంది..

ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్ , అనుష్క శర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్
టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తే ఇది ఓ ట్రైయాంగిల్ ప్రేమకధలాగా తెలుస్తుంది. రణబీర్ తో ఐశ్వర్యారాయ్ చేసిన ఘాటు రొమాన్స్ హైలైట్ గా ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో ఐష్ , రణబీర్ ల మధ్య హాట్ సీన్స్ ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యం లో ఈ ఈ టీజర్ ఎప్పుడెప్పుడా వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులు ఈ టీజర్ తో తెరపడింది, ముందుగా ప్రచారం జరిగినట్లు గానే ఈ చిత్రం లో అదిరిపోయే కిస్సింగ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.