Site icon TeluguMirchi.com

ప్రేమ‌లో ప‌డింది

andreyaకొల‌వెరి సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్‌కి ఓ ఘూటైన ముద్దిచ్చి.. అంద‌రి దృష్టిలో పడింది ఆండ్రియా. విశ్వ‌రూపంలో హాట్ హాట్ గా క‌నిపించింది. విశ్వ‌రూపం 2లో మ‌రింత విజృంభించింద‌ట‌. అన్న‌ట్టు ఈ మ‌ధ్య మీడియా ఫోకస్ ఆండ్రియా పై పడింది. కార‌ణం… ఫాజ‌ల్ అనే ద‌ర్శ‌కుడితో ప్రేమాయ‌ణం న‌డుపుతుండ‌డ‌మే. ఆండ్రియా అన్న‌య‌మ్ ర‌సూలూమ్ అనే ఓ చిత్రంలో న‌టిస్తోంది. దానికి ఫాజ‌ల్ ద‌ర్శ‌కుడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌ని అక్క‌డి ప‌త్రిక‌లు కోడై కూస్తున్నాయి. ఫాజ‌ల్, ఆండ్రియా ప్రేమ‌లో ప‌డ్డార‌ని చిత్ర యూనిట్ సైతం చెబుతోంది. ఫాజిల్ ప్రేమ‌ను ఆండ్రియా ముందు తిర‌స్క‌రించినా… అత‌నిలో నిజాయ‌తీ చూసి ముగ్థురాలైంద‌ట‌. అయితే ఈ విష‌యమై ఇద్ద‌రిలో ఒక్క‌రూ నోరు మెద‌ప‌డం లేదు.

Exit mobile version