Site icon TeluguMirchi.com

DACOIT : అడివి శేష్, శృతి హాసన్‌ పాన్-ఇండియా మూవీకి పవర్ ఫుల్ టైటిల్..!


అందరినీ ఆకట్టుకున్న విజువల్ అసెట్స్ తో ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ పెంచిన అడివి శేష్, శ్రుతి హాసన్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి ‘డకాయిట్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. అంతేకాదు అడివి శేష్, శ్రుతి హాసన్ గన్స్ తో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్, సెన్సేషనల్ టీజర్‌ను షేర్ చేశారు మేకర్స్. ఇందులో హై-ఆక్టేన్ ఫేస్ ఆఫ్ లో తలపడుతునట్లు కనిపించారు. ఇది డకాయిట్ ఇంటెన్స్ వరల్డ్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

అడివి శేష్-శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘డకాయిట్’ ఇద్దరు మాజీ ప్రేమికుల నేపధ్యంలో సాగే గ్రిప్పింగ్ స్టోరీగా రూపొందుతోంది. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దొంగతనాలు చేయడానికి ఏకం కావాలి. ఈ చిత్రం ద్వారా షానెల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇకపోతే డకాయిట్ తర్వలోనే ఫ్లోర్స్ పైకి వెళ్ళనుంది. అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ. స్క్రీన్ ప్లే అందించారు.

ఇక టైటిల్ టీజర్ విడుదల సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఈ చిత్రం గొప్ప అనుభూతిని పంచుతుంది. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని షానీల్ డియో అద్భుతమైన విజన్ తో రూపొందిస్తున్నారని ప్రశంసించారు. అందరినీ ఆకట్టుకునే చాలా స్టైలిష్‌ ఎంటర్ టైనర్ ఇది. ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో భారతదేశంలోని అరుదైన ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల నేపధ్యంలో సరికొత్త అనుభూతిని పంచబోతుంది. ‘డకాయిట్’ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుదని నమ్ముతున్నాను అన్నారు.

#Dacoit Title Teaser (Telugu) | Adivi Sesh | Shruti Haasan | Shaneil Deo | Annapurna Studios

Exit mobile version