ప్రపంచ వేదికపై ‘ఆదిపురుష్’.. అరుదైన గౌరవం


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ మూవీ ‘ఆది పురుష్‌’. రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీలో కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్‌, హ‌ను మంతుడిగా దేవ ద‌త్త నాగే న‌టిస్తున్నారు. ఇక రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. కాగా జూన్‌ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఆదిపురుష్ కి అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలోని న్యూయార్క్‌లో జరగబోయే ట్రిబెకా ఫెస్టివల్లో ‘ఆదిపురుష్‌’ స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. జూన్‌ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ని జూన్‌ 13న ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక అక్కడ ప్రీమియర్‌ పూర్తైన మూడు రోజులకు వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఇక ఈ విషయమై నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓంరౌత్, హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన సంస్కతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతున్నారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ నిజంగా గర్వకారణం. ప్రపంచ ప్రీమియర్‌లో ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు.