Site icon TeluguMirchi.com

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ జై శ్రీ రామ్ సాంగ్..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక విజువల్ గా చూసినట్టు అయితే ఈ ఫుల్ సాంగ్ తో సినిమాలో మమేకం అయ్యిపోతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అజయ్ అతుల్ సంగీతం ప్రభాస్ ప్రెజెన్స్ ఓంరౌత్ విజన్ తో ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version