‘అదుర్స్‌’ అనిపెంచే హీరోయిన్స్ ని ఖారారు చేసిన ఎన్టీఆర్…

Adhurs2-Heroinsవి.వి. వినాయక్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం ‘అదుర్స్’. అప్పటికి వరకు ఎన్టీఆర్ లో కామెడీ యాంగిల్‌ ఉందని తెలియనివారికి కొత్త ఎన్టీఆర్ ని పరిచయం చేసాడు వినాయక్. ముఖ్యంగా రామచారిగా థియేటర్స్ లలో నవ్వుల పువ్వులు పోయించాడు.

ఇప్పుడు అదుర్స్ కు సీక్వెల్‌ అదుర్స్ 2 చిత్ర నిర్మాణం చేయబోతున్నాడు వినాయక్. ఇందుకు కోనవెంకట్‌, గోపీమోహన్‌లు అద్బుమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారట. అంతే కాకుండా ఈ చిత్రం లో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార , ఆండ్రియా పేర్లను ఖారారు చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వి.వి.వినాయక్‌ అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. మరో పక్క ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ‘అదుర్స్ 2’ సెట్స్ ఫైకి రాబోతుందట.