సీమాంధ్ర ఉద్యమం పెద్ద సినిమాలు పొగ పెట్టింది. అయితే చిన్నవి మాత్రం జోరుగా ముస్తాబవుతున్నాయి. పెద్ద సినిమాలో పోటీ పడలేక విడుదల తేదీ ప్రకటించే ధైర్యం చేయలేని కొన్ని సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు పోరుకు సై అంటున్నాయి. చివరాఖరికి సుశాంత్ సినిమా కూడా వచ్చేస్తోంది. సుశాంత్, శాన్వి జంటగా నటించిన చిత్రం అడ్డా. కార్తీక్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. లవ్, మాస్ ఎంటర్టైనర్గా సాగే కథ ఇది. అనూప్ సంగీతం అందించారు. పాటలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాపై సుశాంత్ ఫుల్ కాన్పిడెన్స్తో ఉన్నాడు. బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు సమాచారమ్. మరి అతని అంచనాల్ని ఈ చిత్రం ఎంత వరకూ అందుకొంటుందో చూడాలి.