అడవి శేషు ప్రధాన పాత్రలో రెజీనా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఎవరు’ చిత్రం ఆగస్టు 15వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం గురించి మొన్నటి వరకు పెద్దగా ప్రచారం జరగలేదు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ప్రచారం చేయనక్కర్లేదని, సినిమా విడుదల సమయంలో కాస్త హడావుడి చేసి సినిమా విడుదలైన తర్వాత సినిమానే ప్రచారం చేసుకుంటుందని ఇటీవలే అడవి శేషు అన్నాడు. ఆయన అన్నట్లుగానే ఆయన తాజా చిత్రం ‘ఎవరు’ చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరగుతున్నాయి. అడవి శేషు ఖాతాలో మరో విలక్షణ సినిమా పడటంతో పాటు, సక్సెస్ కూడా పడుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరు చిత్రం ట్రైలర్‌లో చూస్తుంటే అడవి శేషు ఒక అవినీతిపరుడైన పోలీసు అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇక రెజీనా రేప్‌కు గురి కాబడింది. ఆమె తనను రేప్ చేసిన వ్యక్తిని చంపేసింది. అలా ఈ కేసును శేషు ఎలా డీల్ చేశాడు అనేది ఆసక్తికరంగా మారింది.