పవన్‌ కళ్యాణ్‌ కు హీరోయిన్‌ కావలెను

pawan-kalyanపవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి అందరికి తెలిసిందే. నవంబర్ 23 న ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. హీరో,హీరోయిన్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం వేట సాగుతోంది.