సోషల్ మీడియాలో తాను ట్రాన్స్ జెండర్‌గా మారినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. అసలు తనకు అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. నేను ఒక అమ్మాయిని, అందులో ఎలాంటి సందేహం లేదు. నా డ్రస్‌ల విషయంలో కొందరు చేస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. నా చిన్నప్పటి నుండి వాటిని నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ స్నిగ్ద చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో వివిధ రంగాల్లో ఈమె రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక వైపు నటిస్తూనే మరో వైపు దర్శకత్వంపై కూడా ఆసక్తి చూపిస్తోంది.