కోలీవుడ్ లో సూర్య.. జ్యోతిక ముచ్చటైన జంట. నిజ జీవితంలో వారిద్దరిది ఆదర్శప్రాయమైన జీవితం. అయితే సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో మెసేజ్ వారియెంటెడ్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తన సతీమణి జ్యోతిక మెయిన్ రోల్ లో మరో సినిమాను నిర్మిస్తున్నారు సూర్య. ఆ సినిమాకు ‘పొన్మగల్ వందాల్’ అని కూడా పేరు పెట్టారు.
కాగా సీనియర్ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రతాప్ పోతన్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా జేజే ప్రట్రిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మధ్యనే ‘రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక ఇందులో కూడా ఓ సందేశాత్మక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రామ్‌జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా చెన్నై వలసరవాక్కంలోని అగరం ఫౌండేషన్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు శివకుమార్, నిర్మాత, నటుడు సూర్య, కార్తి, జ్యోతిక, భాగ్యరాజ్, పార్తిబన్, పాండియరాజన్, దర్శకుడు హరి, ముత్తయ్య, 2డీ ఎంటర్టైన్మెంట్ సీఈవో రాజశేఖర్, నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు వంటి ప్రముఖులు హాజరయ్యారు.