Dhandora : మరొక విలక్షణ పాత్రలో శివాజీ..


Dhandora : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతోంది. ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఆయన నిర్మిస్తున్న ఈ సినిమాకి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తాజాగా 25 రోజుల సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో విలక్షణ నటుడు శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నైంటీస్’, ‘కోర్ట్’ వంటి విభిన్నమైన కథాంశాలతో ఆకట్టుకున్న శివాజీ ఈ సినిమాలో కూడా తన నటనతో మరోసారి ఆకట్టుకోనున్నారు.

Also Read : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Also Read : దేవర రికార్డు చెరిపేసిన ‘పెద్ది’

ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ బీట్ వీడియోకు మంచి రెస్పాన్స్ లభించింది. సామాజిక విషయాలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో, అగ్రవర్ణాలపై తిరుగుబాటు చేసినవారికి ఎదురయ్యే దౌర్జన్యాల‌ను చూపించబోతున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, సాంప్ర‌దాయాల‌తో పాటు వ్యంగ్యం, హాస్యం, భావోద్వేగాల మేళవింపు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : మామ డైరక్షన్ లో అల్లుడు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ !