సుప్రీం కోర్టును ఆశ్రయించిన కనుసైగ అమ్మాయి


నిన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఆమె పేరు దేశం యావత్తు మార్మోగుతోంది. కనుకట్టుతో కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఆమె పేరు ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. కంటిచూపుతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్న ప్రకాశ్‌ వారియర్‌ క్రేజీ స్టార్.

ఇదిలాఉండగా.. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్‌ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తమ మూవీ యూనిట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా రేపు తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉందని ప్రియా ప్రకాశ్ ఆశిస్తోంది.