‘జపాన్’.. మేడ్ ఇన్ ఇండియా.. కార్తీ న్యూ లుక్


వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కార్తీ 25వ చిత్రం.

అయితే తాజాగా ఈరోజు కార్తీ పుట్టినరోజు కావడంతో.. శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని అతని పాత్ర ఇంట్రో గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. కార్తీని జపాన్‌గా పరిచయం చేసారు. ఇక గ్లింప్స్‌లో కార్తీ గిరజాల జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో హిలేరియస్ గా కనిపించారు. ‘జపాన్’ ఈ సంవత్సరం దీపావళికి విడుదల కానుంది.

ఇకపోతే తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ఇక సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రాజుమురుగన్ – కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ త్రయం ఇప్పటికే అంచనాలను పెంచడంతో ప్రేక్షకులలో తగినంత బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు గ్లింప్స్ కూడా క్యురియాసిటీని పెంచింది.