మార్కెట్‌ని బట్టే బడ్జెట్… అనే సూత్రాన్ని నిర్మాతలంతా మర్చిపోతున్నారు. తమ సినిమాల బడ్జెట్ పెంచుకొంటూ పోతున్నారు. మాస్ హీరోలకూ, టాప్ హీరోలకూ బడ్జెట్ దాటేస్తోందంటే… ఓ అర్థం ఉంది. మినిమం గ్యారెంటీ ఉన్న హీరో సినిమా కూడా బడ్జెట్ కంట్రోల్ తప్పడం భావ్యం కాదు. మనకున్న మినిమం గ్యారెంటీ హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. అతని సినిమా అంటే దాదాపు ఆరు కోట్ల బడ్జెట్ మించకూడదు. ఎందుకంటే… నిర్మాతలకు గిట్టుబాటు అయ్యే అవకాశాలు తక్కువ. అయితే యాక్షన్ సినిమా కోసం ఏకంగా పందొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారట. ఈ విషయం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. నరేష్ సినిమాకి పాతిక కోట్లా? అని అందరూ ముక్కున వేలేసుకొంటున్నారు. కథ, కథనాలపై దర్శకుడికి ఎంత నమ్మకం ఉన్నా…. నరేష్ సినిమాకి ఇన్ని కోట్లు పెట్టడం…. పెద్ద రిస్క్. సుడిగాడుకి మించిన వసూళ్లు దక్కించుకొన్నా పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడం కష్టమే. మరి దర్శకుడు అనిల్ సుంకర ఏ ధైర్యంతో ఈ సాహసం చేశాడో ఏమో? ఈ యాక్షన్ రియాక్షన్ ఇస్తే… ఏం కానూ..?