లాక్ డౌన్ కారణంగా చిత్రసీమ కు భారీ నష్టాలూ వస్తున్నాయి. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం..రిలీజ్ కావాల్సిన చిత్రాలు ల్యాబ్ కు పరిమితం కావడం తో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క చిత్రసీమనే నమ్ముకున్న వేల కార్మికులు షూటింగ్లు లేకపోవడం తో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది.
చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛారిటీ కి ఆర్ధిక సాయాన్ని అందజేస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. అయితే ఓ సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే యాక్షన్ డైరెక్టర్ ఇంతవరకు విరాళం ప్రకటించకపోవడం చర్చ కు దారి తీస్తుంది.