దూకుడు నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వంలో అల్లరి నరేష్, సుదీప్ ,వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’ 3డి. బప్పా-బప్పీ లహరి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో
వేడుక ను ఏప్రిల్ 22 చేయడానికి సన్నాహాలు జరుజరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది.
ట్రాక్ లిస్టు ప్రకారం:
1. సండే మండే రచన : రామ జోగయ్యశాస్త్రి గానం : రంజిత్, సుచరిత
2. ప్రెట్టీ గర్ల్ రచన : సిరాశ్రీ గానం : రఘు కుంచె
3. ఊలాలా … రచన : రాజమ జోగయ్య శాస్త్రి గానం : బప్పీ లహరి
4. డింగ్ డాంగ్ రచన : రామజోగయ్య శాస్త్రి గానం : ప్రియా హిమేష్, చిన్ని చరణ్
5. స్వాతి ముత్యపు జల్లులలో.. రచన : వేటూరి, హంసలేఖ గానం : కార్తిక్, దివిజ
6. మమసితా.. రచన : భావన చంద్ర గానం : బప్పా లహరి
నాగార్జున ‘ప్రేమ యుద్దం’ సినిమాలోని స్వాతి ముత్యపు జల్లులలో అనే వాన పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ను అల్లరి నరేష్ పై చిత్రీకరించారు. ఈ రీమిక్స్ పాటను యువ సంగీత కెరటం థమన్ చేసినట్లు సమాచారం.