చిరంజీవి – కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. పలు కారణాలతో రిలీజ్ బ్రేక్ పడుతూ వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఈరోజు సాయంత్రం 4 :59 PM కు ట్రైలర్ రిలీజ్ ప్రకటన తెలియజేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
మరోపక్క ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఇప్పటికే తేదీని, వేదికను సిద్ధం చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 24న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతులు కూడా వచ్చినట్లుగా సమాచారం. ఇక వేడుకకు ముఖ్య అతిధులుగా రాజమౌళి , పవన్ కళ్యాణ్ లు హాజరు కాబోతున్నట్లు వినికిడి.