ఆ సినిమా షూటింగ్లో భాగంగా అమితాబచ్చన్ కొన్ని యాక్షన్ సీన్స్‌ను చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అమితాబచ్చన్‌కు గాయాలు అయ్యాయి. గాయాలు అయినా కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేశారు. పక్కటెముకలకు చిన్న ప్యాశ్చర్ అయ్యిందని, రెండు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మంచిదని వైధ్యులు సూచించారు. కాని ఎలాంటి నొప్పి మరియు ఇబ్బంది లేని కారణంగా తాను షూటింగ్‌ను కంటిన్యూ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అమితాబ్‌తో సీన్స్‌ను చిత్రీకరించాలంటే చాలా బాధగా ఉందని, కాని ఆయన బలవంతం కారణంగా షూటింగ్ చేస్తున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.