బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరోసారి తల్లి కాబోతున్నట్లుగా ఇటీవలే బచ్చన్ కుటుంబ సభ్యుల ద్వారా వెళ్లడయ్యింది. మొదటి సారి తల్లి అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్య రాయ్ కొత్త సినిమాలు కూడా ఏమీ కమిట్ కావడం లేదు. ఆ సమయంలోనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కొన్నాళ్లకు ఆ అనుమానాలు నిజమే అని నిరూపిస్తూ బచ్చన్ ఫ్యామిలీ ప్రకటన చేసింది.
ఇదే సమయంలో బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్య రాయ్కి శీమంతం నిర్వహించింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖుల నుండి బచ్చన్ మరియు రాయ్ ఫ్యామిలీకి చెందిన వారు పెద్ద ఎత్తున హాజరు అయినట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య శీమంతంకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు మీకోసం ఇక్కడ..!