Site icon TeluguMirchi.com

అభిరామ్ ను నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలి – శ్రీ రెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమ లో క్యాస్టింగ్ కౌచ్‌ రోజు రోజుకు పెరిగిపోతుందని , అవకాశాలు ఇప్పిస్తామంటూ రూమ్ కు పిలిపించుకొని వారి కోర్కెలు తీర్చుకుంటున్నారని , నిర్మాతల దగ్గరి నుండి వారి కుమారుల వరకు ఇలాగే వ్యవహరిస్తున్నారని నటి శ్రీ రెడ్డి గత నెల రోజులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈమెకు అన్ని సంఘాల నుండి మద్దతు పెరుగుతుండడం తో ఈమె ఆందోళనలు మరింత రెట్టింపు చేస్తుంది.

తాజాగా తన పేస్ బుక్ లో సినీ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ను నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ , ఇలాంటి వారిని ఆలా అరెస్ట్ చేస్తూనే ఇంకెవరు ఆడవారి ఫై ఇలాంటివి చేయరు అంటూ వాక్యాలు చేసింది. అలాగే రామానాయుడు స్టూడియో ఫై కూడా ఘాటైన వాక్యాలు చేసింది. ‘వందల మంది ఆడ పిల్లల మానాలు నలిగిన రామానాయుడు స్టూడియోస్ నుండి ఆ అమ్మాయిలకి న్యాయం జరగాలి, అభిరామ్ లాంటి వాళ్ళని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలి, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలి, నా ఉద్యమానికి మరకలు అంటించే వాళ్ళకి ఇదే నా సవాల్’ అంటూ ఆమె సవాల్ విసిరింది.

Exit mobile version