తమన్నా దుమ్ములేపింది..

Abhinetri-2nd-teaserతమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం అభినేత్రి. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన అభినేత్రి, నిన్న చిత్రానికి సంబందించిన రెండవ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ మొత్తం తమన్నానే కనిపిస్తుంది. మూమూలుగానే తమన్నా డాన్సులు ఇరగదీస్తోంది. ఇక ప్రభుదేవా చేతిలో పడితే ఇంకెలా దుమ్ములేపుతుంది చెప్పండి. ఈ టీజర్ లో కూడా అలానే దుమ్ములేపింది.అదిరిపోయే స్టెప్పులతో తన డాన్సు తో అదరగొట్టింది.

ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎం వివి సత్యనారాయణ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. టీజర్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి…