ఆటగాళ్లు ట్రైలర్ టాక్..

హిట్ ,ప్లాప్ లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా నారా రోహిత్..ఈసారి ఆటగాళ్లు అంటూ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీ స్టార్ అయినా జగపతి బాబు ఈ మూవీ లో మరో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబదించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ విషయానికి వస్తే…

ఇది ఒక హత్య కేసు చుట్టూ అల్లుకున్న కథగా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. రోహిత్ సినీ దర్శకుడిగా కనిపించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమ్ క్రిమినల్ లాయర్ గా జగపతి బాబు మరోసారి తన అద్భుతమైన నటనను కనపరిచినట్లు తెలుస్తుంది. ఓ హత్య కేసులో చిక్కుకుపోయిన దర్శకుడైన నారా రోహిత్ కు క్రిమినల్ లాయర్ జగపతి బాబుకు మధ్య సాగే ఆటే ఈ ‘ఆటగాళ్లు’ చిత్రం. పోలీస్ అధికారి పాత్ర లో సుబ్బరాజు కనిపించాడు. ఓవరాల్ గా డైరెక్టర్ పరుచూరి మురళి ఈ మూవీ ని చాల ఆసక్తి గా తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఈ మూవీ తో నారా రోహిత్ ఖాతాలో ఓ హిట్ పడడం గ్యారెంటీ అనిపిస్తుంది.

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర – వాసిరెడ్డి శివాజీ – మక్కెన రాము – వడ్లమూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా , దర్శన బానిక్ హీరోయిన్ గా నటించింది.