Site icon TeluguMirchi.com

డిసెంబర్ 6న ‘ఆట ఆరంభం’

aarambhamఅజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ముఖ్యపాత్రల్లో విష్ణువర్థన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సంచలన మల్టీస్టారర్ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం దిశగా పయనిస్తోంది. తమిళంలో వున్న పాత రికార్డులను క్రాస్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆట ఆరంభం’ పేరుతో ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా.శీనుబాబు, తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ నెల 24న ఆడియో ను డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో రికార్డ్ కలెక్షన్స్ చేసిన ఈ చిత్ర టాలీవుడ్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version