Site icon TeluguMirchi.com

అన్నయ్య కుడా అల్లరి చేస్తాడట

aryan-rajeshఈవీవీ తనయుడిగా తెరంగ్రేట్రం చేశాడు ఆర్యన్ రాజేష్. అయితే తమ్ముడు అల్లరి నరేష్ లా విజయాలు సాధించలేకపోయాడు. అటు ప్రేమకధలు ఎంచుకోలేక, మాస్ పాత్రలు చేయలేక, కామెడీ వేషాలు రాక…. ఆయన కెరియర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యింది. చాలా కాలం నుంచి ఆయన మేకప్ కి దూరంగా వున్నారు. పెళ్ళయ్యాక నిర్మాతగా మారాలని ప్రయత్నాలు కుడా చేశారు. మళ్ళీ ఇంతకాలానికి కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆర్యన్ రాజేష్ కధానాయకుడిగా భూమిజా సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ రచయిత దివాకర్ బాబు తనయుడు శ్రీకర్ బాబు దర్శకత్వం వహిస్తారు. ఈనెల 29 నుంచి ఊటీ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. థ్రిల్లర్ నేపధ్యం లో సాగే సినిమా ఇది. వినోదానికీ ప్రాధాన్యం వుంది. ఓ అల్లరి కుర్రాడి పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపిస్తారు. ప్రస్తుతం కధానాయిక కోసం అన్వేషిస్తున్నారు.

Exit mobile version