Site icon TeluguMirchi.com

హిందీకి వెళ్తున్న ఆర్య 2

aarya 2 in hindiద‌క్షిణాదిలో హిట్టయిన సినిమాని బాలీవుడ్‌లో ఎగ‌రేసుకుపోవ‌డం మామూలే. ఇప్పుడు ఓ మాదిరి సినిమాల్నీ వ‌ద‌ల‌డం లేదు. ద‌క్షిణాదిన స‌రిగా ఆడ‌ని సినిమాల్ని కాస్త మార్పులు చేసుకొని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది వాళ్ల ఆలోచ‌న‌. ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి ఆర్య 2పై ప‌డింది. అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యికలో వ‌చ్చిన ఈ చిత్రం తెలుగులో ఆశించిన విజ‌యాన్ని అందుకోలేదు. ఇప్పుడీ క‌థ‌ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని చూస్తున్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యంగ్ హీరోతో ఈ సినిమా తీయాల‌ని భావిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసి పెట్టమ‌ని సుకుమార్‌నే అడిగార‌ట‌. మ‌రి సుక్కు అందుకు ఒప్పుకొంటాడా? బాలీవుడ్‌లో అడుగుపెడ‌తాడా..? నిర్ణయం సుక్కుదే.

Exit mobile version