Site icon TeluguMirchi.com

ఆ సినిమా దాట‌లేనంటున్న బ‌న్నీ!

allu-arujunఒకొక్కరికీ ఒక్కో సినిమాపై మ‌మ‌కారం. ఎన్ని సినిమాలొచ్చినా చిరంజీవి కెరీర్‌ లో ఖైదీ ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. నాగ్ అయితే…. శివ‌ను మ‌ర్చిపోడు. పెద‌రాయుడు గురించి మోహ‌న్‌ బాబు చెప్పుకొంటూనే ఉంటారు. అల్లు అర్జున్‌ కీ అలాంటి ఓ సినిమా ఉంది. అదే.. ఆర్య‌. ఈ సినిమాతోనే బ‌న్నీ త‌న‌లోని స్టైల్‌, ఈజ్‌…. పూర్తి స్థాయిలో చూపించేశాడు. ఆ సినిమా అంటే బ‌న్నీకి ప్రాణ‌మ‌ట‌. ఎన్ని సినిమాలు చేసినా… ఆర్య స్థానం ఆర్యదే. ఇప్పుడు బ‌ద్రినాథ్‌ లాంటి భారీ సినిమాలు చేయొచ్చు. వ‌సూళ్ల ప‌రంగా భారీ విజ‌యాలు సాధించొచ్చు. కానీ ఆర్యను దాటేసే సినిమా చేయ‌లేను. ఆ సినిమాలో నా పెర్‌ ఫార్మెన్స్ నాకే ఎప్పుడూ స‌వాల్ విసురుతూ ఉంటుంది. దాన్ని మించిన న‌ట‌న‌… మ‌రే సినిమాలోనూ ప్రద‌ర్శించ‌లేక‌పోయా. ఆర్యను బీట్ చేసే సినిమా తీయాల‌నేది నా టార్గెట్‌… అంటూ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు.

Exit mobile version