Aarambham : మస్ట్ వాచ్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్


‘C/o కంచరపాలెం’ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. టైమ్ ట్రావెల్, డెజా వూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది.

Also Read : ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

‘ఆరంభం’ కథలోకి వస్తే, ఖైదీ నంబర్ 299 కాలాఘటి జైలు నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి.

Also Read : టాలీవుడ్ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న మహిళా నిర్మాత

టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ని మిస్ అవ్వకండి.