ఆకాష్ అమావాస్య

akashప్రేమ క‌థా చిత్రమ్ విజ‌య‌వంతం అయిన త‌ర‌వాత హార‌ర్ చిత్రాల హ‌వా మ‌ళ్లీ మొద‌లైంది. ఆకాష్ కూడా ఈ జోన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అదే… అమావాస్య‌. రాఖీ సావంత్ సోద‌రుడు రాకేష్ సావంత్ ఈ సినిమాతో ద‌ర్శకుడిగా మారాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు సాగుతున్నాయి. ఓ కామాంధుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకొన్న ఓ జంట‌, ప్రేతాత్మలుగా మారి ఆ దుర్మార్గుడిని ఎలా అంతం చేశాయి? త‌మ ప‌గ ఎలా తీర్చుకొన్నాయి? అనేదే ఈ సినిమా క‌థాంశం. ముమైత్ ఖాన్ ఓ ప్రత్యేగ గీతంలో అల‌రించ‌బోతోంది.