Site icon TeluguMirchi.com

ఈ రోజు నుండి మహేష్ ‘ఆగడు’

maheshమహేష్ బాబు, దర్శకుడు శీను వైట్ల కాంబినేషన్ తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘ఆగడు’. తమన్నా హీరోయిన్. ఇటివలే ముహర్తం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో మహేష్ మరో సారి పొలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో చిత్రం నడుస్తుందని టాక్. ఒక్క సమంత తప్పితే.. మొత్తం ‘దూకుడు’ కాంబినేషన్ ‘ఆగడు’లో రిపీట్ అవుతుంది. మహేష్ ఫుల్ మాసీ గా వుంటూనే డిఫరెంట్ గా కనిపిస్తారు. దూకుడు కేవలం ట్రైలర్ మాత్రమే మహేష్ లోని అసలు దూకుడు ను ఈ చిత్రంలో చూస్తారు’అని వైట్ల అంటున్నారు. ఈ చిత్రం 2014 వేసవిలో విడుదల కానుంది.

Exit mobile version