Site icon TeluguMirchi.com

బ్రహ్మీ ని మళ్లీ పిండేస్తున్నాడు !

mahesh bramhiమహేష్ బాబు, దర్శకుడు శీను వైట్ల కాంబినేషన్ తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘ఆగడు’. తమన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది . దర్శకుడు శీను వైట్ల.. మహేష్ బాబు, బ్రహ్మనందం, వెన్నెల కిశోర్, ఎంఎస్ నారాయణ పై కొన్ని హాస్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘దూకుడు’ లో పద్మశ్రీ ( బ్రహ్మనందం )  టాలెంట్ మొత్తం పిండేసిన మహేష్ ఆగడు కోసం మరో సారి పిండుకోవడానికి (టాలెంట్ , టైమింగ్ ) రెడీ అయ్యాడు. ఇక ఈ చిత్రం లో మహేష్ మరో సారి పొలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో చిత్రం నడుస్తుందని టాక్. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2014 వేసవిలో విడుదల కానుంది.

Exit mobile version