ఆగడు సినిమా హక్కుల్ని జెమినీ టీవీ కైవసం చేసుకొంది.
అయితే ఎంతకీ..?
రూ.15 కోట్లు వెచ్చించిందన్న న్యూస్ తెలియగానే చిత్రపరిశ్రమ షాక్‌తింది. శాటిలైట్‌కి అంత మొత్తమా?? అని ఆశ్చర్యపోయింది. మహేష్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేశారు. పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది (12 కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసిందని సంబర పడ్డారు. అయితే.. అప్పుడే ఈ శాటిలైట్ కథ మరో టర్న్ తీసుకొంది. మహేష్ బాబుకి పవన్ రికార్డ్ బద్దలు కొట్టేంత సీన్ లేదని పవర్ స్టార్స్ ఫ్యాన్స్ చెబుతున్నారు. రూ.15 కోట్లు ఇచ్చింది ఆగడు సినిమా ఒక్కదానికే కాదట. 14 రీల్స్ నిర్మించిన `లెజెండ్`తో కలిపి ఈ సినిమాని రూ.15 కోట్లకు అమ్మారట. అంటే.. ఆగడు కనీస ధర.. రూ.10 కోట్లన్నమాట. అయితే పవన్ రికార్డ్ సేఫేనన్నమాట.