ప్రేక్షకులు ఈ చిత్రం ట్రైలర్‌తో కనెక్ట్ అవుతున్నారు. ఒక క్యూట్ లవ్ స్టోరీతో పాటు సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఆదికి ఇది మరో సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ సినిమాల టైం నడుస్తోంది. కనుక కాస్త ఎంటర్టైన్మెంట్తో పాటు బోరింగ్ కొట్టే సీన్స్ లేకుంటే మాత్రం సినిమా మంచి హిట్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ట్రైలర్ వరకు ఓకే కాని సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.