Site icon TeluguMirchi.com

బోల్డ్ గా అమలాపాల్ ..షాక్ లో అభిమానులు

అమలాపాల్ బోల్డ్ గా కనిపించి అందరికి పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పటివరకు చాల పద్దతిగా ఎక్కడ అందాల ఆరబోత కు పెద్ద తావివ్వకుండా లిప్ లాక్ వంటి హాట్ హాట్ సన్నివేశాలకు సైతం దూరంగా ఉన్న అమలా..తాజాగా బోల్డ్ గా కనిపించే సరికి అందరు అయోమయంలో పడ్డారు. ఏంటి నిజంగా అమలేనా..అంటూ ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..

రత్నకుమార్ డైరెక్షన్లో అమలా పాల్ తాజాగా ‘ఆడై’ అనే సినిమా చేస్తుంది. దీని తాలూకా ఫస్ట్ లో టీజర్ ను ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ విడుదల చేసారు. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ థ్రిలర్ గా సాగింది. ఆఖర్లో బోల్డ్‌గా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కోసం, పాత్ర కోసం అమలాపాల్ ఇలాంటి ధైర్యం చేయడం పట్ల అందరూ మెచ్చుకుంటున్నారు.

Exit mobile version