‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ : టైటిల్ మ్యాజిక్ సినిమాలో లేదు

TeluguMirchi Rating : 2.25/5

కామెడీ ఎంటర్ టైనరస్ తో అలరించే అల్లరి నరేష్‌ కొనాళ్ళుగా సీరియస్‌ సినిమాల వైపు దృష్టి పెట్టారు. చాలా కాలం త్ర్వాత్య మళ్లీ తన కామెడీ జోన్‌లోకి వచ్చి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రం చేశారు. ఈవీవీ క్లాసిక్ టైటిల్ కావడం, ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా థియేటర్లో ఏస్థాయిలో నవ్వులు పూయించిందా ?

గ‌ణ (అల్లరి న‌రేష్‌)కి గవర్నమెంట్ జాబ్ వుంటుంది కానీ పెళ్లి మాత్రం కాదు. పెళ్లి చూపుల్లో హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వుంటాడు. చివరి ప్రయత్నంలో మాట్రిమొనీలో తన ప్రొఫైల్ ఇస్తాడు. ఆ క్ర‌మంలో సిద్ది (ఫ‌రియా అబ్దుల్లా) ప‌రిచ‌యం అవుతుంది. గ‌ణ‌కు సిద్ది బాగా న‌చ్చుతుంది. అయితే సిద్ది మాత్రం ఓ కండీషన్ పెడుతుంది. ఏమిటా కండీషన్ ? అసలు సిద్ది ఎవరు ? గ‌ణ పెళ్లి క‌ల తీరిందా? ఇదంతా తెరపై చూడాలి.

పెళ్లి చుట్టూ జరుగుతున్న బిజినెస్ ని ఓ పెళ్లి కాని ప్రసాద్ పాత్ర ద్వారా ప్రేక్షకులకి మెసేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచన బావుంది కానీ అది తెరపైకి చాలా నీరసంగా వచ్చింది. గణ పెళ్లి చూపుల త‌తంగంతో క‌థ మొద‌ల‌వుతుంది. హీరోయిన్ ప‌రిచ‌యం, మాట్రిమొనీలో స్కీములు ఇదంతా మొదట్లో ఎదో సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందుకు వచ్చే ట్విస్ట్ కూడా ఓకే అనిపిస్తుంది. అయితే తర్వాత ఈ కథ అక్కడక్కడే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా తేలిపోయింది. చివర్లో ఆ ఎమోషన్, కోర్ట్ రూమ్ డ్రామా సహనానికి పరీక్షా పెడతాయి. ఓవరాల్ గా సినిమా ఎలాంటి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. ఇటు కామెడీ లేక అటు ఎమోషన్ కనెక్ట్ కాక రెండికి చెడ్డ రేవడిలా తయారైయింది.

న‌రేష్ డీసెంట్ గా కనిపించారు. ఐతే కామెడీ సెన్స్ కాస్త త‌గ్గింది. ఫ‌రియా హుషారుగా కనిపించింది. న‌రేష్ మ‌ర‌ద‌లి పాత్రలో న‌టించిన జేమీ లివర్ కొన్ని చోట్ల నవ్విపిస్తుంది. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యత లేదు. గోపిసుంద మ్యూజిక్ తెలిపోయింది. కథకు తగ్గ నిర్మాణ విలువలు వున్నాయి. ఈ సినిమా కోసం ఈవీవీ క్లాసిక్ టైటిల్ వాడురు. దీనికి మాత్రం న్యాయం చేయలేకపోయారు.

ఫైనల్ పంచ్: టైటిల్ కి న్యాయం జరగలేదు.