గత కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్..‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ కొట్టేసరికి మనోడి జాతకం మారినట్లే అని అంత అనుకున్నారు. అల అనుకున్నారో లేదో వెంటనే తెనాలి రామకృష్ణ రూపంలో మరో ప్లాప్ పడింది. దీంతో తన తదుపరి సినిమాలను చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్.
ప్రస్తుతం సందీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాల పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని సింగల్ కింగులం అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో మీరే చూడండి.